AP Assembly : ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (Assembly )లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మంత్రి నిమ్మల రామానాయుడు (Ramanaidu) అనారోగ్యంతోనే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. సెలైన్ బాటిల్ చేతికి పెట్టినప్పుడు వినియోగించే కాన్యులాతో ఆయన సభకు వచ్చారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఆయనతో సరదాగా మాట్లాడారు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పని చేస్తానంటే సస్పెండ్ (Suspended) చేయిస్తానని చమత్కరించారు. విశ్రాంతి తీసుకుంటారా? సభ నుంచి సస్పెండ్ చేయించాలా అని వ్యాఖ్యానించారు. నిన్నటితో పోలిస్తే, ఇవాళ ఆరోగ్యం బాగానే ఉంది అని నిమ్మల బదులిచ్చారు. ఆరోగ్యం సహకరించడంతోనే అసెంబ్లీకి వచ్చానని పేర్కొన్నారు. ప్రశాంత నిద్ర వల్లే ఆరోగ్యం కుదుటపడుతుందని నిమ్మలకు మంత్రి లోకేశ్ సూచించారు. ఆయన విశ్రాంతి తీసుకునేలా రూలింగ్ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ను కోరారు.













