దేశ చరిత్రలో ఇదే ప్రథం… కొందరు ఐపీఎస్లు : లోకేశ్
జగన్ పుణ్యమా అని సీఐడీ క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ డిపార్టుమెంట్గా మారిపోయిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. మేం ఎప్పటి నుంచో చెబుతున్న మాటలు నేడు నిజమయ్యాయి. రాష్ట్రంలో కొందరు ఐపీఎస్లు తమ ఉద్యోగ ధర్మాన్ని వీడి జగన్ పోలీస్ సర్వీస్ (జేపీఎస్)గా మారారు. ఐపీఎస్లు ఇంతగా బరితెగించడం. దేశ చరిత్రలో ఇదే ప్రథమం. మా కుటుంబంపై బురద చల్లేందుకు భారీ కుట్ర జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా సీఐడీ డీఐజీ రఘరామిరెడ్డి మా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. అధికారం పోతుందని తెలిసే పత్రాలు దహనం చేశారు. పత్రాలు తగులబెడితే పాపాలు పోతాయా? జగన్ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు సమీపించాయి. చేసిన నేరానికి మూల్యం చెల్లించుకో తప్పదు అని మండిపడ్డారు.













