రాజ్ ఘాట్ లో నారా లోకేశ్ మౌనదీక్ష
ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద టీడీపీ నేతలు నివాళులర్పించారు. మహాత్మాగాంధీకి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో పాటు టీడీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు అంజలి ఘటించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి మౌనదీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలను రాజ్‌ఘాట్ నుంచి దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. అక్రమ కేసులు బనాయిస్తూ ప్రతిక్షాలను వేధిస్తున్నారని మండిపడ్డారు. జగన్ అవినీతి, నిరంకుశ పాలనపై కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు.













