పన్నెండేళ్లుగా ప్రతీ క్షణం నిన్ను ప్రేమిస్తూనే ఉన్నా
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దంపతులు తమ 12వ పెళ్లి రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా తన భార్య బ్రాహ్మణిపై తనకున్న ప్రేమను ట్విటర్ ద్వారా తెలియజేశారు. ప్రత్యేకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. 12 సంవత్సరాలు, 144 నెలలు, 4,383 రోజులు, 1,05,192 గంటలు, 63,11,520 నిమిషాలు, 37,86,91,200 సెకన్లు… నీను లేని ఒక్క సెకను కూడా ఊహించుకోలేను.. నా గుండెలోతుల్లో నుంచి నిన్ను ప్రేమిస్తున్నా.. హ్యాపీ యానివర్సరీ బ్రాహ్మణీ అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు మనస్ఫూర్తిగా ఈ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2007లో వివాహబంధంతో ఒక్కటైన వీరికి కుమారుడు దేవాన్ష్ ఉన్నాడు.













