జీఎస్టీ అమలులోకి రావడం శుభపరిణామం… నారా బ్రాహ్మణి
దేశంలో వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి రావడం శుభపరిణామమని హెరిటేజ్పుడ్స్ కార్యనిర్వాహక డైరెక్టర్ నారా బ్రాహ్మణి అన్నారు. కేంద్ర జీఎస్టీ, కస్టమ్స్ శాఖ ప్రధాన కార్యాలయంలో జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బ్రాహ్మణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ రకాల పన్నులను రద్దు చేసి ఏకికృత జీఎస్టీని కేంద్రం తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. జీఎస్టీతో వినియోగదారుడికి, వ్యాపార వర్గాలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మేలు జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు 165 దేశాల్లో జిఎస్టి అమలవుతోందని, ఆ జాబితాలో భారత్ కూడా చేరిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అపోలో ఆస్పత్రుల ఎండీ సంగీతారెడ్డి, జీఎస్టీ చీఫ్ కమిషనర్ సందీప్ ఎం.భట్నాగర్ తదితరులు పాల్గొన్నారు.













