రాష్ట్రానికి రాజధాని లేకపోవడం సిగ్గుచేటు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర అనకాపల్లిలో కొనసాగింది. రోలుగుంట మండలం జేపీ అగ్రహారంలో ఆమె పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన పార్టీ కార్యకర్త సుర్ల దేవుడమ్మ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ సంద్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ వారి కుంటుంబానికి అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 50 రోజుల పాటు యుద్ధం జరగబోతోందని, దాన్ని ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి రాజధాని లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. మహిళలను హింసించడమే వైసీపీ ధ్వేయంగా పెట్టుకుందని ఆరోపించారు.













