నంద్యాల టీడీపీ అభ్యర్థి కి తృటిలో తప్పిన ప్రమాదం..
నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ ప్రయాణిస్తున్న కారు అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురి అయింది. నంద్యాల నుంచి కర్నూలు వెళుతున్న సమయంలో అనుకోకుండా ఆయన కారుకి యాక్సిడెంట్ జరిగింది. పాణ్యం మండలం, తుమ్మరాజు పల్లె వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు మీద ప్రయాణిస్తున్న సమయంలో కారుకు అకస్మాత్తుగా రోడ్డుకు అడ్డం వచ్చిన పశువులను కారు ఢీ కొట్టింది. కారు ముందర భాగం బాగా డామేజి అయినప్పటికీ కారులో ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో ఫరూక్ గారు స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు.













