వైసీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం
నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకోసారి ఓట్లు అడుక్కోనని, ఎమ్మెల్యేగా పోటీ చేయనని ప్రకటించారు. కార్యకర్తలు వచ్చినా, రాకపోయినా.. వాళ్ల కాళ్లు పట్టుకోనని ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఊరికి పని కావాలంటే కార్యకర్తలే తన దగ్గరకు రావాలని, తాను ఏదో చెయ్యాలని ఎమ్మెల్యేను అయ్యానని, ఏదో అయ్యిందని ఇక చాలని ఎమ్మెల్యే ఆర్థర్ నైరాశ్యంతో కూడిన వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు. సమాచారం ఇవ్వకుండానే వస్తున్నారని ఎమ్మెల్యే కార్యకర్తలు ప్రశ్నించి సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంటింటికీ తిరిగి ఓట్లడిగి గెలిపిస్తే, సమాచారం ఇవ్వకుండానే వస్తున్నారని కార్యకర్తలు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో, కార్యకర్తల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. జూపాడు మండలం బన్నూరులో ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరైన సందర్భంలో ఈ మొత్తం ఎపిసోడ్ జరిగినట్లు తెలిసింది.













