ఎన్నికల్ టైం లో వైసీపీ కి భారీ షాక్.. హస్తం తో చేయి కలిపిన సిట్టింగ్ ఎమ్మెల్యే..
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీకి పార్టీ కు ఎన్నికల ముందే భారీ షాక్ తగిలింది.సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ వైసీపీ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.హస్తం పార్టీ లో చేరిన ఆర్థర్కు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మల కండువా కప్పి ఆహ్వానించారు. వైసీపీ నియోజక వర్గ సమన్వయకర్త విషయంలో చేస్తున్న మార్పులు సరిపడక ఆయన పార్టీని వీడినట్లు తెలుస్తోంది.ఆర్దర్కు టిక్కెట్ ఇవ్వొద్దని స్థానిక నేతలు ఒత్తిడి చేశారని , ఆర్దర్ అభ్యంతరాలను పక్కన పెట్టి స్థానికేతరుడైన సుదీర్ను సమన్వయకర్తగా పార్టీ పెద్దలు ప్రకటించారు అని టాక్. కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే అయిన ఆర్ధర్ 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసి గెలిచారు. నందికొట్కూరు రిజర్వుడు నియోజకవర్గంగా ప్రకటించక ముందు అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుల హవా ఎక్కువగా ఉండేది. అలాంటి నియోజకవర్గం లో ఆర్ధర్ గెలవడంతో చాలా వివాదాలు మొదలయ్యాయి. ఆర్దర్ ను కాదు అని బైరెడ్డికి పార్టీ పెద్దలు ప్రాధాన్యత ఇవ్వడం, అతనికి కనీసం ఎమ్మెల్యే ప్రోటోకాల్ కూడా దక్కక పోవడం పై ఆర్దర్ పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఎంత చెప్పినా ఎవరూ పట్టించుకోకపోవడం తో ఆర్ధర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.అతని తో పాటు మరికొందరు ఎస్సీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది అని టాక్.













