టీటీడీ చైర్మన్ గా నందమూరి హరికృష్ణ?
నందమూరి హరికృష్ణకు ఎంతో కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ పదవిని దక్కనుంది. గత కొంత కాలంగా పార్టీకి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న హరికృష్ణను, ఏ విధంగానైన్నా సరే మచ్చిక చేసుకుని, ఆయన సేవలను పార్టీకి వినియోగించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనదైన శైలీలో వినియోగానికి సిద్దమైనట్లు తెలిసింది. నందమూరి హరికృష్ణకు ఎంతో కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని కట్టబెట్టేందుకు సుముఖంగా ఉన్నారనే ప్రచారం జోరందుకున్నది. ఇప్పటికే ఈ పదవి కోసం అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతరులు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి వద్ద లాబీయింగ్ చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు కూడా. రాజమండ్రి ఎంపీ మురళీమోహన్, రాయపాటి సాంబశివరావు టీటీడీ చైర్మన్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఈనేపథ్యంలో నందమూరి హరికృష్ణ పేరు తాజాగా తెరపైకి రావడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా స్తబ్ధంగా ఉంటున్న హరికృష్ణ, ఆయన తనయుడు జూనీయర్ ఎన్టీఆర్లను ప్రత్యక్షం చేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమచారం. హరికృష్ణకు టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టడడం ద్వారా ప్రజల్లో ఉన్న అపోహలకు బ్రేక్ వేయవచ్చని అధినేత భావిస్తున్నట్లు సమాచారం. పార్టీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న హరికృష్ణ రానురాను పార్టీకి దూరంగా వస్తుండడంతో అనేక అపోహలు, విమర్శలకు దారి తీసింది. వీటిని తొలగించుకోవడంతో పాటు పార్టీ పటిష్టతకు ఆయన రాక ఎంతో ఉపయోగపడుతుందని అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే టీటీడీ చైర్మన్ పదవిని నందమూరి హరికృష్ణకు ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలిసింది. హరికృష్ణకు టీటీడీ పదవిని కట్టబెట్టడం ద్వారా నందమూరి కుటుంబాన్ని మరింతగా అక్కున చేర్చుకున్నట్లు అవుతోంది. దీంతో వ్యూహాత్మకంగా అధినేత నందమూరి హరికృష్ణకు ఈ పదవిని కట్టబెట్టాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది.













