జగన్కు లేఖ రాసిన బాలయ్య…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లేఖ రాసారు. తన నియోజకవర్గం తరపున పలు వినతులను ఆయన లేఖలో ప్రస్తావించారు. వీటిలో ముఖ్యంగా తమ హిందూపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని బాలయ్య తన లేఖలో కోరారు. హిందూపురం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని, కర్ణాటక రాజధాని బెంగళూరు కి దగ్గరగా ఉండటంతో పాటు అనువైన స్థలం కూడా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం జగన్ తో పాటు ఏపీ సీఎస్ నీలం సాహ్నికి కూడా బాలకృష్ణ లేఖ రాసారు.
మరోవైపు స్థానికంగా మెడికల్ కళాశాల వివాదంపై కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కి లేఖ రాసారు. హిందూపురం సమీపంలోని మలుగూరు వద్ద మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటుకు హిందూపురం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని హిందూపురం లో జనాభా, ఇతర అవసరాల దృష్ట్యా మెడికల్ కళాశాల అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు.













