హిందూపురంలో బాలయ్య ప్రచారం
వైకాపా ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ విమర్శించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నలుగురు మంత్రులతో మాఫియా నడుపుతున్నారని ఆరోపించారు. తనను విమర్శించే వైకాపా నాయకులు ఈ రెండేళ్లలో ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడే ఈ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు. అన్ని విభాగాలను ప్రైవేటు పరం చేసి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.













