కన్నబాబు, అంబటి లకు నాంపల్లి కోర్టు షాక్
హెరిటేజ్ సంస్థ పరువునష్టం కేసులో ఆంధప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబులకు నాంపల్లి కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు విచారణ నేడు జరిగింది. ఈ నేపథ్యంలో వారు కోర్టు హాజరు కాకపోవడంతో వచ్చే వాయిదాకు రావాల్సిందేనని కోర్టు పేర్కొంటూ ఈ మేరకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. హెరిటేజ్ సంస్థపై కన్నబాబు, అంబటి వ్యాఖ్యలు చేశారంటూ ఆ సంస్థ పరువునష్టం దావా వేసింది. దీనికి సంబంధించిన విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో జరుగుతుండగా, వైసీపీ నేతలు విచారణకు హాజరుకాలేదు. ఫిబ్రవరి 5న వారిద్దరూ విచారణకు రావాలని కోర్టు ఆదేశించినా ఫలితం లేకపోయింది. ఎవరైనా ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయో వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.













