టీడీపీలోకి మాజీ సీఎం సోదరుడు?
కార్యకర్తల అభీష్టం మేరకు తెలుగుదేశం పార్టీలో చేరుతామని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డి అన్నారు. తమ కుటుంబం 30 సంవత్సరాలుగా రాజకీయాల్లోకి వచ్చి పార్టీకతీతంగా ప్రజా సేవ చేశామని అన్నారు. తంత్రి, తరువాత అన్న ముఖ్యమంత్రిగా ఎదిగి నియోజక వర్గానికి దాదాపు రూ.2000 కోట్లు అభివృద్ధి పనులు చేశారన్నారు. ప్రస్తుత ఎంపి, ఎమ్మెల్యే తమకు ఎలాంటి సహాయం చేయలేదని తన అనుయాయులు తన వద్ద వాపోయారన్నారు. మీరు ఏ పార్టీకి వెళ్లినా తాము మీవెంటనే నడుస్తామని కార్యకర్తలు తనకు చెప్పారని కిషోర్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రతి పంచాయితీలోనూ కార్యకర్తలు అభిప్రాయం తెలిపితే తాము టీడీపీలో చేరడానికి సిద్దంగా ఉన్నామని ఆయన అన్నారు.













