సొంతగూటికి మాజీ సీఎం?… సోనియాతో ముగిసిన మంతనాలు!
అధికారం లో వున్నంతకాలం ఎవరు చెప్పినా వినకుండా ఆంద్రప్రదేశ్ నిండునూరేళ్ళు విడగొట్టి వున్నది పోగొట్టుకొని ఉంచుకొన్నది పోగొట్టుకొని ఆరిపోతున్నదీపం లావున్న కాంగ్రెసు కు ఇప్పుడు ఎవరూ దిక్కూ లేక ఆఖరికి చిరుదీపం కనపడుతున్నట్టుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కనపడడం మళ్ళీ సొంతగూటికి చేర్చుకుంటానికి రంగం సిద్ధమైంది. ఇందుకు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో కిరణ్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. 2004లో ప్రభుత్వ చీఫ్ విప్ గా బాధ్యతలు చేపట్టి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరడానికి ఆయన కృషి చేసారు. 2009లో అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికయ్యారు. వైఎస్ మరణాంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోశయ్య ఎన్నిక కావడం, ఆయనకి వయస్సు మీద పడడడం, పార్టీ ప్రభుత్వ సమన్వయ లోపం, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జగన్ బలపడుతుండడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిఎంగా రోశయ్యని తప్పించి, కిరణ్ కుమార్ రెడ్డికి 2010 సెప్టెంబర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించారు.
తెలంగాణ ఉద్యమ అణచివేతతో పాటు, జగన్ అరెస్ట్ సమయాలలో అల్లర్లు చెలరేగకుండా తన సమర్ధతను నిరూపించుకున్నారు. చివరి శాసనసభా సమావేశాల్లో సమైక్యాంధ్ర కోసం పోరాడి ఓడారు. ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరి ఏదో రాష్ట్రానికి గవర్నర్ గా వెళతారని కూడా ప్రచారం జరిగింది. కానీ కార్యరూపం దాల్చలేదు. 2019 ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్రంలో బిజెపిని, రాష్ట్రంలో టిడిపి, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను బలపరచడానికి అధిష్టానం చేపట్టిన దిద్దుబాటు చర్యలలో భాగంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏముంది ఇక్కడ మేం పొడవలేకపోయాం కాని ఈయనొచ్చి పొడుస్తాడట అంటున్న హైదరాబాదు కాంగ్రేసు వర్గాలు..













