అందుకోసమే బీజేపీలో చేరాను : నల్లారి
పదవులు ఆశించి బీజేపీలో చేరలేదని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కమార్ రెడ్డి అన్నారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన సేవలు పార్టీకి ఎక్కడ అవసరమైతే అక్కడ పనిచేసేందుకు సిద్దమని స్పష్టం చేశారు. అధిష్ఠానం అస్తవ్యస్థ నిర్ణయాలతో కాంగ్రెస్ బాగా దెబ్బతింది. కాంగ్రెస్ పార్టీ ఒక్కో రాష్ట్రంలో బలహీనపడుతోంది. పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తాం అన్నారు. వద్దని చెప్పా. ప్రజలకు మేలు చేయవచ్చనే నమ్మకంతోనే బీజేపీలో చేరా అని చెప్పారు. తాను సీఎంగా ఉన్నప్పటి కంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎంతో సాయం అందిస్తోందన్నారు. రాష్ట్రానికి అవసరమైన నిధులను తీసుకొస్తామన్నారు. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగానికి లోబడే పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు.
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు నావే. హైదరాబాద్లో పుట్టా. అక్కడే చదువుకున్నా. అక్కడే ఉంటున్నా. నా తండ్రి సొంతూరు చిత్తూరు జిల్లా. వాయల్పాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను. బెంగళూరులోనూ నాకు ఇల్లు ఉంది. కర్ణాటక కూడా నా స్వస్థలం అనొచ్చు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నివాసం ఉంటాను. పార్టీ ఎక్కడ పనిచేయమంటే అక్కడ చేస్తా. కష్టపడి పనిచేస్తే పదవులు వాటంతట అవే వస్తాయి. పదవులపై ఎవరితోను మాట్లాడలేదు. ఎన్నికల్లో టికెట్ ఆశించడం లేదు. నా పోటీపై తుదినిర్ణయం పార్టీ అధిష్టానానిదే. రాజధానిపై పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటాను అని తెలిపారు.













