తెలుగుదేశంలోకి మాజీ సీఎం
మాజీ మఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. భేటీ అనంతరం పార్టీ కండువా ప్పుకోనున్నారు. కిశోర్ కుమార్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అమర్ నాథ్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. కాగా నల్లారి కుటుంబానికి చిత్తూరు జిల్లా పీలేరులో గట్టి పట్టుంది. గత మూడేళ్లుగా నల్లారి సోదరులు ఎటూ కాకుండా పోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర విభజన అనంతరం సమైక్యాంధ్ర పార్టీ స్థాపించాడు. కానీ, ఆశించిన స్థాయిలో ఆ పార్టీకి ఆదరణ లభించకపోవడం తెలిసిందే. కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరతారా? లేదా? అనే విషయం ఎటూ తేలడం లేదు. ఇలా ఏళ్ల తరబడి ఆలోచిస్తూ కూర్చుటే రాజకీయ భవిష్యత్ ఉండదని కిషోర్ కుమార్ రెడ్డి భావిస్తున్నారని, అందుకే ఆయన టీడీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది.













