అవసరమైతే వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తాం : నల్లపురెడ్డి
ప్రభుత్వ భూములకు పట్టాలు ఇప్పిస్తానంటూ తన పేరుతో నెల్లూరు జిల్లా విడవలూరు మండలానికి చెందిన వైసీపీ నేత వసూళ్లకు పాల్పడుతున్నారని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విడవలూరు మండలం పొన్నపూడి గ్రామంలో వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక వైసీపీ నేతల వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు నేత ప్రతిపక్ష నాయకులు, రైతుల వద్ద రూ.లక్షలు వసూలు చేసినట్లు వెల్లడిరచారు. చాలా సార్లు మందలించినా తీరు మార్చుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. గౌరవంగా బతుకుతున్న తనకు, పార్టీకి చెడ్బపేరు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. తీరు మార్చుకోకపోతే క్షమించేది లేదని, అవసరమైతే పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు.













