చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ అక్టోబరు 3వ తేదీకి వాయిదా పడింది. రెండ్రోజుల క్రితం చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థలూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించారు. ఆ రత్వాత సీఐడీ తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు కొససాగించారు. ఏజీ వాదనలకు లూథ్రా కౌంటరు వాదనలు వినిపిస్తూ కేవలం రాజకీయ దురుద్దేశంతోనే సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో తదుపరి వాదనలు కొనసాగించేందుకు విచారణ అక్టోబరు 3కు వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు.













