నాగేంద్రమ్మ ను అభినందించిన ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణానికి లక్ష రూపాయలు విరాళం అందించిన అందురాలుశ్రీమతి గూడూరు నాగేంద్రమ్మ. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామానికి చెందిన శ్రమతి గూడూరు నాగేంద్రమ్మ రెండు కళ్ళు లేని అందురాలు. తనకు రాయపూడి గ్రామంలో గల నాలుగు ఎకరాల భూమి పై వచ్చిన లక్షరూపాయల ఆదాయాన్ని రాజధాని నిర్మాణానికి విరాళంగా ముఖ్యమంత్రి ని ఉండవల్లి ప్రజావేదిక లో కలసి అందచేశారు.రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి తనను భాదించిందని అందుచేత తనవంతు సహాయం చేయాలనే ఉదేశ్యంతో లక్ష రూపాయలు ఇచ్చానని ఆమె ముఖ్యమంత్రి కి తెలిపారు.
రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకుని ప్రజలందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి పడుతున్న కష్టానికి తోడుగా తమ వంతు సహకారాన్ని విరాళాల రూపంలో అంది చాలని కోరారు.
తన మనుమరాలు కుమారి ధన్వి 3 సంవత్సరాల వయస్సు లో ప్రపంచ మెమరీ పోటీలలో ప్రధమ స్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి కి పరిచయం చేసారు. కుమారి
ధన్వి ని ముఖ్యమంత్రి అభినందించారు. శ్రీమతి నాగేంద్రమ్మ వెంట ఆమె భర్త శ్రీ ప్రసాదరావు,కుమారులు శ్రీనాగ కోటేశ్వర రావు, ఉమామహేశ్వరరావు, కోడళ్ల శ్రీమతి
రాజ్యలక్ష్మి, భావన ఉన్నారు.













