తన ఓటమి కోసం పనిచేసిన నేతలే .. మళ్లీ బరిలోకి
చిత్తూరు జిల్లా నగరి, పుత్తూరు పురపాలక ఎన్నికల్లో వైకాపా రెబల్ అభ్యర్థులపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో వైకాపా ఓటమికి కొందరు నేతలు పనిచేశారని, టీడీపీ గెలిచినా ఫర్వాలేదని ఉద్దేశంతో 14 మంది తిరుగుబాటు రెబెల్స్ ను బరిలోకి దింపారని ఆమె ఆరోపించారు. వారు గెలిచేందుకు పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమి కోసం పనిచేసిన నేతలు మళ్లీ బరిలోకి దిగారని, నగరి పుత్తూరులో వైకాపా గెలవకూడదని కుట్రలు పన్నారని ఆరోపించారు. వెన్నుపోటుదారులను పార్టీ అదిష్ఠానం గుర్తించాలని రోజా విజ్ఞప్తి చేశారు. అన్ని కుట్రలనూ చేదించి నగరి, పుత్తూరులో వైకాపానే గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.













