అంతర్జాతీయ తెలుగు మహాసభలకు నాగాలాండ్ గవర్నర్
రాజమండ్రి గైట్ కళాశాల ఆవరణలో జనవరి 5 నుంచి 7 వరకు జరిగే ఆంధ్ర సారస్వత పరిషత్ అంతర్జాతీయ తెలుగు మహాసభలకు ముఖ్య అతిధిగా నాగాలాండ్ గవర్నర్ లాగణేషన్ విచ్చేస్తున్నారు. రాజ రాజనరేంద్రుడి పట్టాభిషేక సహస్రాబ్ది మహోత్సవ సందర్భంగా సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో ఈ సభలను సారస్వత పరిషత్, చైతన్య విద్యాసంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఆంధ్రమే వ జయతే కార్యక్రమంలో గవర్నర్ భాగస్తులౌతారు. ఈ సందర్భంగా ఆంధ్రవాంజ్మయవైజయంతి ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతల్ని సత్కరిస్తారని నిర్వాహకులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ వెల్లడించారు.













