డైవర్ట్ చేయబోయి అడ్డంగా బుక్ అయిపోయిన నాగబాబు..
మెగా బ్రదర్ నాగబాబు ఎప్పుడు సంచలనమైన స్టేట్మెంట్లు ఇవ్వడానికి ఫేమస్. ఇటీవల ఎన్నికలు ముగిసిన తర్వాత అల్లు అర్జున్ గురించి ఓ ట్వీట్ పెట్టిన నాగబాబు ఆ తర్వాత అకౌంట్ ని డిఆక్టివేట్ చేసి రెండు రోజుల పాటు సైలెంట్ అయ్యారు. తిరిగి మళ్లీ తన ట్వీట్ ను డిలీట్ చేసి ట్విట్టర్ లో యాక్టివ్ అయిన నాగబాబు ఓ సరికొత్త వీడియోని పోస్ట్ చేశారు. దీంతో మరొకసారి ట్రోలింగ్ కు అతను టార్గెట్ అయ్యాడు. ఈ వీడియో చూసిన నేటిజన్లు అతన్ని మరింత దారుణంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. జనసేన నాయకులకు సందేశం ఇస్తున్నాను అంటూ నాగబాబు మొదలుపెట్టిన ఆ వీడియోలో.. సీఎం జగన్ పై తనకున్న అక్కసునంతా బయట పెట్టారు.
కౌంటింగ్ ముగిసి కూటమి విజయం ఖాయం అని చెప్పిన తర్వాత కూడా జగన్ తన కుర్చీ వదలను అంటాడేమో అని సెటైర్ వేశారు. అంతేకాదు ఫలితాలు విడుదల తర్వాత అల్లర్లు సృష్టించడానికి వైసీపీ నేతల సిద్ధంగా ఉన్నారని.. వారిని ఎదుర్కోవడానికి జనసైనికులు కూడా రెడీగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈవీఎం మిషన్లను ఉంచిన స్ట్రాంగ్ రూముల వద్ద జనసైనికులు, నేతలు అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపలా ఉండాలి అని నాగబాబు పిలుపునిచ్చారు.
దీంతో స్ట్రాంగ్ రూమ్ వద్ద పార్టీ నేతలను కాపలాగా ఉండమంటున్నారు ఇది ఎక్కడ చోద్యం అని.. నెటిజెన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అల్లు అర్జున్ పై పెట్టిన ట్వీట్ ను పక్కదారి పట్టించడానికి నాగబాబు ఈ వీడియో పెట్టారు అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలను రెచ్చగొట్టి.. ఏదో ఒక కొత్త తగువు సృష్టించి కాసేపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని సైలెంట్ చేయడానికి నాగబాబు వేసిన ఈ ప్లాన్ వైలెంట్గా అతనిపైనే రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది. ఇలా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన మరుసటిరోజే నాగబాబు తిరిగి మళ్ళీ ట్రోలింగ్ కు బలైపోయారు.













