కౌంటింగ్ రోజు సంయమనం పాటించండి..జన సైనికులకు పిలుపునిచ్చిన నాగబాబు..
ఆంధ్రాలో మే 13న జరిగిన పోలింగ్ నేపథ్యంలో పలుచోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌంటింగ్ రోజు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎన్నికల సంఘం పోలీసు శాఖను అప్రమత్తం చేసింది. ఎక్కడికి అక్కడ తీవ్రమైన నిఘా ఏర్పరచడంతో పాటు సమస్యాత్మకమైన నియోజకవర్గాలపై అత్యంత శ్రద్ధ కనబరుస్తోంది. హింసాత్మకమైన సంఘటనలు చోటు చేసుకోనప్పటికీ హై టెన్షన్ సృష్టిస్తున్న నియోజకవర్గాలలో పిఠాపురం కూడా ఒకటి. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఒక రకమైన టెన్షన్ నెలకొని ఉంది.
తాజాగా నాగబాబు పార్టీ క్యాడర్ కు కొన్ని సూచనలు అందివ్వడం జరిగింది. పోలింగ్ రోజున ఎటువంటి సంఘటనలు జరిగాయో అందరం చూసాం.. కాబట్టి ఫలితాలు విడుదలయ్యే రోజు ఎట్టి పరిస్థితుల్లో కవ్వింపులకు రియాక్ట్ కావద్దని నాగబాబు సూచించారు. అయితే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న నాగబాబు ఇప్పుడు సడన్ గా కేడర్ కు ఇటువంటి సూచనలు ఎందుకు ఇచ్చారు? దాడులు జరుగుతాయి అన్న విషయంపై పార్టీకి ఏమైనా సంకేతాలు అందాయ? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
మరొక నాలుగు రోజులలో ఎన్నికల ఫలితాలు తేలిపోతాయి.. అందుకే అన్ని పార్టీలు తమ తమ కార్యకర్తలను అలర్ట్ చేశాయి. ఓడిపోయిన పార్టీలు ఆవేశంగా దాడులకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి.. పోలింగ్ రోజు జరిగిన పరిస్థితులను గమనించుకొని.. కౌంటింగ్ రోజు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రతి పార్టీ తమ నాయకులకు సూచనలు పంపిస్తోంది. ఇదే రీతిలో జనసేన నేత మెగా బ్రదర్ నాగబాబు.. ఓటమి భయంతో వైసిపి దాడులు చేసే అవకాశం ఉంది అని అంటున్నారు.
ఈ నేపథ్యంలో కూటమినేతలు, కార్యకర్తలు, జన సైనికులు తో పాటుగా పిఠాపురం ప్రజలు కూడా సంయమనం పాటించాలని ఆయన కోరారు. వైసీపీ పరాజయ్యపు అంచుల్లో ఉంది కాబట్టి.. ఓట్లు లెక్కింపు సమయంలో వారు అల్లర్లు సృష్టించడానికి పాల్పడే అవకాశం ఉందని.. కాబట్టి అందరూ సంయమనం పాటించాలని.. ఎన్నికల కమిషన్ కు సహకరిద్దామం.. అంటూ నాగబాబు విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియోని విడుదల చేశారు. అయితే గత ఎన్నికల్లో నాగబాబు ఎటువంటి సూచనలు చేయలేదు.. మరి ఈ ఎన్నికల్లో తాము గెలుస్తాము అన్న ధీమా ఏర్పడింది కాబట్టే ఆయన ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారు అని అందరు భావిస్తున్నారు.













