ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన సిద్ధం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చిన జనసేన పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ నేత నాగబాబు అన్నారు. విశాఖ జిల్లాలో జనసేన నేతలతో నాగబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని అన్నారు. విశాఖ హెరిటేజ్ అయిన రుషికొండను కొట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొత్తులపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడిరచారు. త్వరలో బూత్ కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీచేసే ఆసక్తి తనకు లేదని నాగబాబు స్పష్టం చేశారు.













