జనసేన గెలుపునకు ప్రవాసులు కృషి చేయాలి : నాగబాబు
వచ్చే సార్వత్రిక ఎన్నికలు జనసేనకు కీలకమని, ప్రవాసాంధ్రులంతా పార్టీ విజయానికి కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు పిలుపునిచ్చారు. అమెరికాలో నివసిస్తున్న జనసైనికులతో ఆయన టెలీకాన్ఫరెన్సులో మాట్లాడారు. తటస్ఠ ఓటర్లను పార్టీ వైపు మలచడంతో పాటు పార్టీ సిద్ధాంతాలు, భావజాలం, పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయాలు సామాన్యులకు చేరేలా బాధ్యతలు తీసుకోవాలన్నారు. ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్న వారు స్వదేశానికి వచ్చి విజయానికి పాటుపడాలన్నారు. త్వరలోనే తాను అమెరికాలో పర్యటిస్తానన్నారు.













