పవన్ చెప్పింది వింటే.. 2024లో సీఎంగా
పవన్ కల్యాణ్ చెప్పింది వింటే 2024లో ముఖ్యమంత్రిగా చూసుకోవచ్చని జనసేన నేత నాగబాబు అన్నారు. మంగళగిరిలో నాగబాబు మీడియాతో మాట్లాడుతూ సమస్య వచ్చినప్పుడు ప్రజలకు గుర్తొచ్చే నాయకుడు పవన్ కల్యాణ్ అని అన్నారు. పవన్ వెళితే సమస్య తీరుతుందని నమ్మకం జనాలకు ఉందన్నారు. గతంలో పోలిస్తే ఉత్తరాంధ్ర కార్యకర్తలు చాలా మోటివేట్ అయ్యారని, పనిచేయని నాయకులను ప్రశ్నించే స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. అక్రమ మైనింగ్, ఇసుక తవ్వకాలపై జనసైనికుల పోరాట ప్రతిమ అమోఘమన్నారు. వైజాగ్ రుషికొండ వ్యూ చాలా అద్భుతమైందని, దాన్ని కొట్టేస్తుంటే ప్రతిఘటించింది జనసేన కార్యకర్తలేనని గుర్తు చేశారు. వైసీపీలో లంచగొండితనం సింగిల్ విండోలా తయారైందని, అవంతి శ్రీనివాస్ ఎర్ర కొండలు తినేస్తున్నాడని ఆరోపించారు. స్వార్థం, కన్నింగ్ మైండ్, లంచగొండి తనం లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని అన్నారు.













