వైసీపీ వాళ్ళు తిడితే భావోద్వేగంతో.. జనసైనికులు కోప్పడితే కేసులా?: నాగబాబు
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మెగా బ్రదర్ నాగబాబు విమర్శల వర్షం కురిపించారు. జగన్ అవినీతికి కేరాఫ్ అడ్రస్ అంటూ మండిపడ్డారు. “గతంలో వైసీపీ నేతలు నోరు జారినప్పుడు వెనకేసుకొచ్చిన జగన్.. తనవాళ్లు భావోద్వేగంలో మాట తూలారని చెప్పారు. మరి ఎదుటి పార్టీ వాళ్లకు భావోద్వేగాలు ఉండవా? వాళ్ళు కూడా భావోద్వేగంతో మాట తూలే అవకాశం ఉంది kada’ అని నాగబాబు అన్నారు. తనవారిని వెనకేసుకొచ్చిన జగన్.. ఎదుటి వాళ్ళు మాట తూలితే పోలీస్ కేసులు పెట్టిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలపై కేసులు పెట్టని పోలీసులు, జన సైనికులపై ఎందుకు కేసులు పెడుతున్నారని నాగబాబు ప్రశ్నించారు. ఎవరి మీద దాడి చేయకుండానే 307 సెక్షన్ కింద ఎలా కేసులు పెడుతున్నారు? అని నిలదీశారు. జగన్ డైరెక్షన్లో కావాలని చేసిన కుట్రే ఇదని ఆయన మండిపడ్డారు. జరిగిన గొడవలో పవన్ పాత్ర ఉన్నట్లు చూపించడానికి పోలీసులు ప్రయత్నించారని నాగబాబు ఆరోపించారు.













