ఆ పార్టీ పతనాన్ని త్వరలోనే మనమంతా చూస్తాం
తక్కువ మంది యువత మాత్రమే రాజకీయాల్లోకి వస్తున్నారని జనసేన నేత నాగబాబు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ యువత రాకపోతే రాజకీయాల్లోకి దుర్మార్గులు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ యువతకే అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. తాను పార్టీ అభివృద్ధికి మాత్రమే పనిచేస్తానని తెలిపారు. వైసీపీ నేతలు, సీఎం జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాలు, ప్రజలను చితక్కొట్టడమే తమ నైజం అన్నట్లగా అధికార పార్టీ నేతల వ్యవహారశైలి ఉందన్నారు. వైసీపీ పతనాన్ని త్వరలోనే మనమంతా కళ్లారా చూస్తామని అన్నారు.













