సీఎం జగన్ జాక్పాట్ కొట్టారు..ఆధిక ఆదాయంతో పాటు
మద్యం ద్వారా అధిక ఆదాయం సంపాదించడంతో పాటు అప్పు కూడా పొంది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జాక్పాట్ కొట్టారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహన్ ఎద్దేవా చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధమంటే మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడమా? అని అన్నారు. గతంలో మద్యం ద్వారా రూ.9వేల కోట్ల ఆదాయం ఉంటే ప్రస్తుతం మద్యం ఆదాయం రూ.22 వేల కోట్లకు పెరిగిందన్నారు. ఇదేనా మద్యపాన నిషేధం? అని ప్రశ్నించారు. ఇప్పుడ ఆ రాబడి చూపించి రూ.8 వేల కోట్ల ప్రభుత్వ బాండ్లు అమ్ముతున్నారన్నారు. ఇదీ స్పిరిటెడ్ విజనరీ. జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఇదేనా అంటూ చురకలంటించారు.













