ఇంటింటి సమాచారం తేవాలని వారికి ఎవరు చెప్పారు? : నాదెండ్ల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యలపై సీఎం జగన్ ఏనాడైనా మాట్లాడారా? అని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాదెండ్ల మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు లేక యువత ఇబ్బందిపడుతుంటే వైసీపీ ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు. వాలంటీర్ వ్యవస్థను వైసీపీ వ్యవస్థగా చెబుతున్నారు. దీని గురించి పవన్ మాట్లాడిన విషయాలపై కేసు నమోదు చేశారు. వారి కోసం ఏటా రూ.1,560 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దానిలో రూ.617 కోట్లు డేటా సేకరణ కోసం కేటాయించారు. ఇంటింటి సమాచారం తేవాలని వారికి ఎవరు చెప్పారు? ఈ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా? అలా సేకరించిన సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారు? వీటికి సమాధానం చెప్పకుండా మంత్రులు, పోలీసులు ఎదురుదాడికి దిగుతున్నారు. వాలంటీర్లపై జనసేన పార్టీకి ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు అని తెలిపారు.













