అందువల్లే బ్యాంకులు బ్లాక్ లిస్టులో పెట్టాయి : నాదెండ్ల
వైసీపీ ప్రభుత్వం చేతగానితనం వల్లే జాతీయ బ్యాంకులు బ్లాక్ లిస్టులో చేర్చాయని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారుల నిర్మాణం పేరుతో న్యూడెవలప్‌మెంట్ బ్యాంక్, ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌ల నుంచి తీసుకున్న రుణాలను ప్రభుత్వం సకాంలో చెల్లించలేదన్నారు. ఆ డబ్బులను దుర్వినియోగం చేసినందునే బ్లాంకులు బ్లాక్ లిస్టులో పెట్టాయని తెలిపారు. ఈ బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలను చెల్లించాలని కేంద్రం ఎన్నిసార్లు హెచ్చరించినా, ముఖ్యమంత్రి జగన్ పెడచెవిన పెట్టారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర పరువును తీసేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు జోకులు వేసుకునేలా చేశారన్నారు. నిధుల దుర్వినియోగం కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడిరచారు.













