బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. నాదెండ్లకు కండువా కప్పిన షా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 1978లో తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన నాదెండ్ల.. 1983లో ఎన్టీఆర్ టీడీపీని పెట్టినప్పుడు ఆయనతో కలిసి నడిచారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా, నాదెండ్ల భాస్కరరావు ఆయన మంత్రి వర్గంలో కేబినెట్ హోదా కలిగిన ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ మరుసటి సంవత్సరం ఎన్టీఆర్ ను పీఠం నుంచి దింపి ముఖ్యమంత్రి అయిన విషయం విదితమే. అయితే 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 16 వరకు కేవలం నెల రోజులు మాత్రమే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేశారు.













