కియాకు చంద్రబాబు శుభాకాంక్షలు
దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం కియా పరిశ్రమ మేడిన్ ఇండియా పేరుతో తయారు చేసిన తొలి కారును నేడు ప్రారంభించనుంది. దీనిపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కియా మొదటి కార్ ఇవాళ రోడ్డుపైకి వస్తున్న సందర్భంగా మనస్ఫూర్తిగా కియాను అభినందిస్తున్నానని అన్నారు. ఆటో మొబైల్ రంగంలో కియా ఒక నూతన ట్రెండ్ తీసుకురావాలని ఆకాంక్షించారు. కియా కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కియా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందని, కియా సంస్థ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చంద్రబాబు చెప్పారు.













