ఆంధ్రా మీడియా రాజకీయాలలోకి ఈసీ ఎంట్రీ..
ఏపీలో అసలు సిసల రాజకీయాలు నేటి నుంచే ప్రారంభం అవుతాయి. రాజకీయ పార్టీలకు మధ్య ఇప్పటివరకు జరిగిన యుద్ధాలు ఒక లెక్క జరగబోయేది ఒక లెక్క అన్నట్టు ఉండి పరిస్థితి. నాయకులు చేసే మాటల దాడి కంటే కూడా మీడియాతో చేల్చే ఇన్ డైరెక్ట్ వార్ ఎక్కువైపోయింది. కొందరు పత్రికా విలువలను గాలికి వదిలి.. కొన్ని పార్టీలకు కొమ్ము కాయడం కోసం అదేపనిగా దుష్ప్రచారాలు చేస్తున్నారు. అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తూ.. నానార్ధాలు, పర్యాయపదాలు జోడిస్తూ.. అర్ధాన్ని తారుమారు చేయడంలో కొందరు తమ చేతివాటాన్ని చూపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏది నిజమైన ప్రెస్ నోట్ ..ఏది పెయిడ్ ఆర్టికల్ అన్న విషయం సామాన్యుడకే అర్థం కాదు. ఈ నేపథ్యంలో సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ.. సొంత టీవీ ఛానల్ మైంటైన్ చేసే రాజకీయ పార్టీల గురించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ తమ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేస్తే.. ఆ ఖర్చులను కూడా అభ్యర్థుల ఎన్నికల వ్యయంగా పరిగణిస్తామని ఆయన తెలియజేశారు. అలాగే పార్టీలకు మద్దతుగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రచారం చేయడం.. కార్యక్రమాలలో పాల్గొనడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని, అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.













