చంద్రబాబునాయుడు కనుచూపు మేరలో ఉండగా…..
ముద్రగడ పాదయాత్ర ప్రారంభించి ప్రభుత్వం కు విసిరిన చాలెంజ్ అధికార పార్టీని తీవ్రంగా కుదిపేసింది. ప్రభుత్వం కు ఓ షాక్ ఇచ్చింది. పోలీస్ వైఫల్యం అంటూ అధికార పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. పోలీస్ అధికారులలో కలవరం మొదలయింది. ఈ వైఫల్యం ఎవరో ఒక పోలీసు ఉన్నతాధికారిపై వేటు వేయించగలదని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే అటువంటి తీవ్రచర్య తీసుకుంటే పోలీసుల మనోభావాలు దెబ్బతినవచ్చు కూడా. కాకినాడ లో ఎన్నికల సమయంలో ముద్రగడ పాదయాత్ర ప్రారంభించడం, పోలీసులు అడ్డుకొని ఆయనను అదుపులోకి తీసుకోవడం వల్ల టిడిపికి ఓట్ల రూపంలో నష్టం జరుగుతాదని నాయకులు భావిస్తున్నారట…!













