Mrunal: ఆ సినిమాకి మృణాల్ అంత ఛార్జ్ చేస్తోందా?
అడివి శేష్(Adivi Sesh) హీరోగా నటిస్తున్న చిత్రం డెకాయిట్(Decoit). ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు శృతి హాసన్(Shruthi Hassan) ను తీసుకున్నారు. షూటింగ్ లో కూడా శృతి పాల్గొంది. కొన్ని సీన్స్ ను కూడా చిత్ర యూనిట్ ఆమెపై షూట్ చేసింది. కానీ తర్వాత అనూహ్యంగా డెకాయిట్ నుంచి శృతి తప్పుకుంది. దీంతో శృతి ప్లేస్ లో మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ని తీసుకున్నారు.
ప్రస్తుతం డెకాయిట్ ప్లేస్ లో మృణాల్ షూటింగ్ లో పాల్గొంటుంది. అయితే ఈ సినిమాకు మృణాల్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాకవాల్సిందే. ఈ సినిమాకు రూ.3.5 కోట్లకు పైగా ఛార్జ్ చేస్తుందట. ఈ రెమ్యూనరేషన్ శృతి హాసన్ కంటే ఎక్కువని తెలుస్తోంది. అయితే డెకాయిట్ కోసం ముందుగా శృతికి రెండున్నర కోట్లు మాత్రమే ఆఫర్ చేశారట.
కానీ శృతి తప్పుకున్న తర్వాత మృణాల్ కు మూడున్నర కోట్లు ఇచ్చి తీసుకురావడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. మృణాల్ అంత డిమాండ్ చేయకపోయినప్పటికీ పాన్ ఇండియా లెవల్లో ఆమె క్రేజ్ ను దృష్టిలో మేకర్స్ ఆఫర్ చేశారట. పైగా శృతి మార్కెట్ ను బీట్ చేయాలనే యాంగిల్ లో కూడా మృణాల్ కు ఆ రేంజ్ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.













