టీడీపీకి ఎంపీ తోట రాజీనామా
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎంపీ తోట నరసింహం తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఎంపీ పదవికి, లోక్‌సభలో టీడీపీ పక్ష నేత పదవికి రాజీనామా చేస్తూ లోక్‌సభ స్పీకర్‌కు లేఖలు పంపించినట్లు వెల్లడించారు. చంద్రబాబు ఇచ్చిన పిలుపుమేరకు ప్రత్యేక హోదా అంశంపై విశ్రాంతి లేకుండా ఆందోళనలు కొనసాగించిన కారణంగా తాను అనారోగ్యానికి గురయ్యాయని, అయినా అధ్యక్షుడు తన పట్ల మానవత్వం చూపించకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రిని అనేకసార్లు కలిసి పరిస్థితిని విన్నవించినా స్పందించక పోవడంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నేడు వైకాపా అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.













