ఎంపీ తోట సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంతో తెలుగుదేశం పార్టీ ఎంపీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాకినాడ ఎంపీ తోట నర్సింహం, ఆయన కుటుంబసభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆయన నివాసంలో కలిశారు. అనారోగ్యం దృష్ట్యా ఈ సారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని తోట నర్సింహం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఆయన స్థానంలో ఆయన సతీమణికి జగ్గంపేట అసెంబ్లీ టికెట్‌ను తోట కోరుతున్నట్లు సమాచారం. ఇందు కోసమే ఆయన చంద్రబాబుని కలిసి అభ్యర్థించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే జగ్గంపేట నుంచి సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో తోట ముఖ్యమంత్రిని కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.













