మార్పు మొదలైంది.. 2024లో వైకాపాకు పరాభవం
22 మంది వైకాపా ఎంపీలు ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేదని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప్పు, పప్పు, చెత్త తో సహా ప్రతి దానిపై వైకాపా ప్రభుత్వం పన్ను వేసి మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తోందని అన్నారు. బూడిద రత్నాలను నవరత్నాలుగా ప్రచారం చేస్తున్న సర్కారు ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నాయకులు బూతులు తిట్టడంలో మాత్రం పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల్లో ఇప్పటికే మార్పు మొదలైందని అన్నారు. 2024 ఎన్నికల్లో వైకాపాకు పరాభవం తప్పదని అన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీకి వెన్నుపోటు పొడిచిన మంత్రి కొడాలి నానికి రానున్న రోజుల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.













