పాలకుడు రాముడో, రావణుడో…అప్పటి వరకు
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసుల విచారణ పూర్తయ్యేవరకు రాష్ట్రంలో అడుగుబెట్టబోనని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలకుడు రాముడో, రావణుతో తేలాలని అన్నారు. సీఎం జగన్ తన అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. తనపై ఈగ వాలినా జగన్‌దే బాధ్యతని అతడికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ వేసిన తర్వాత తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. బెదిరింపులపై ప్రధానితో పాటు కేంద్రహోంమంత్రికి ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. రమణ దీక్షితులు జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చడం దురదృష్టకరమని అన్నారు.













