2024లో ప్రజాక్షేత్రంలోనే.. ప్రజలే చెబుతారు
2024లో ప్రజాక్షేత్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోమన్ రెడ్డికి ప్రజలే బుద్ది చెబుతారని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు అన్నారు. ఢిల్లీ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిల్చొనే పరిస్థితి కూడా లేకుండా ఆనాడు తనను కొట్టారని అన్నారు. తన గుండెలపై కూర్చొని విపరీతంగా కొట్టారని తెలిపారు. నా సెల్ఫోన్ కోసం వెతికి మళ్లీ కన్ను కొట్టారు. మొత్తం ఐదుసార్లు నన్ను తీవ్రంగా కొట్టారు. సీఎం జగన్, సునీల్ ఇద్దరు అద్భుత కళాకారులు. ఓ కానిస్టేబుల్ వచ్చి ఏం జరిగింది. ఎవరు కొట్టారని అమాయకంగా అడిగారు. హెడ్ కానిస్టేబుల్ వచ్చి నన్ను మంచంపై పడుకోబెట్టారు. ఉన్మాది సంస్కృతిలోనే భాగంగానే నాపై దాడి చేశారు. ఇది నా 60వ పుట్టినరోజు. ఎన్నో పుట్టినరోజులు ఘనంగా జరుపుకొన్నా. 59వ పుట్టినరోజు ఘనంగా జరిపిన ఉన్మాదికి ధన్యవాదాలు అని అన్నారు.













