వారిని కేబినెట్ నుంచి మారిస్తే.. పార్టీలో సంక్షోభం
ప్రధాని మోదీ జగన్‌ను ఎందుకు పిలిచారో తనకు తెలుసునని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణమరాజు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్ ద్వారా సీఎం జగన్ ఇష్టానుసారం అప్పులు చేస్తున్నారని, ఈ విషయంలో ప్రధాని మోదీ జగన్‌ను మందలించారని అన్నారు. దమ్ముంటే బొత్స, కొడాలి నానిని కేబినెట్ నుంచి తీసేయాలని సీఎం జగన్‌కు సవాల్ విసిరారు. ఒకవేళ వారిని కేబినెట్ నుంచి మారిస్తే పార్టీలో సంక్షోభం తప్పదని హెచ్చరించారు. సీఎం పదవినే ఎవరికన్నా ఇస్తే బాగుంటుందన్నారు.
కరెంట్ కూడా ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వం ఇది, సీఎం తీరుతో ఆంధ్రుల గుండె ఆగేలో ఉందని అన్నారు. ప్రజలు అనుకునేది వింటే సీఎం గుండె ఆగి చనిపోతారన్నారు. విజయసాయి వియ్యంకుడికి అంబులెన్స్‌ల కాంట్రాక్ట్ ఇచ్చారన్నారు. ప్రభుత్వం తనపై చేసిన దాష్టీకం పిటిషన్ సుప్రీంకోర్టులో వచ్చిందన్నారు. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని సుప్రీం ఆదేశించిందన్నారు. సుప్రీంకోర్టు నాలుగు వారాలకు ఈ పిటిషన్ వాయిదా వేసిందని తెలిపారు. సాక్షి యాజమాన్యం వార్తను వార్తలాగా రాయాలన్నారు. రెడ్డికి అంత కంగారు అవసరమా? అని ప్రశ్నించారు.













