ఎన్టీఆర్పై ప్రేమ ఉంటే.. ఒక్క పథకానికైనా : రఘురామ
ఈ ప్రభుత్వానికి ఎన్టీఆర్పై ప్రేమ ఉంటే అన్న క్యాంటీన్లు ఎందుకు మూసేశారని ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి పథాకానికి జగనన్న, వైఎస్సార్ పేరు పెట్టే బదులుగా కనీసం ఒక్క పథకానికైనా ఎన్టీఆర్ పేరు పెట్టవచ్చు కదా అని అన్నారు. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినంతమాత్రానా ఆ సామాజిక వర్గం ఓట్లు వస్తాయా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో సలహాదారులు మీడియాతో మాట్లాడడడంపై ఇప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. ఇప్పుడు ఉద్యోగులతో సంప్రదింపులు చేయాల్సిన బుగ్గన జాడ లేదని విమర్శించారు. శాసన సభ, శాసన మండలి సభ్యుడు కాని సజ్జల అన్నింటా తానై వ్యవహరించడం తగదన్నారు. సజ్జల ఉద్యోగులను విభజించి పాలించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.













