సినిమా సమస్యకు ఒక పరిష్కారం చూపాలి : రఘురామ
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ముఖ్యమంత్రి జేబులో నుంచి ఇస్తున్నారా? అని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏదో ఒక కారణంతో సినిమా థియేటర్లు మూసి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హీరోలను గెలికి సూపర్ హీరోల్లా ఫీల్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. సినిమా సమస్యకు ఒక పరిష్కారం చూపాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. కేంద్ర కూడా నిధులు ఇస్తోందని, మరి జగనన్న పేరు ఏంటని నిలదీశారు. ప్రభుత్వం ఖర్చుతో ఇష్టానుసారంగా పార్టీ పేరు మీద ప్రకటనలు ఇస్తున్నారని ఆరోపించారు. సమాచార శాఖ కార్యదర్శికి అసలు బుద్ది ఉందా? అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి బెయిల్పె ఉండి రెండున్నరేళ్ల నుంచి కోర్టుకు రావడం లేదన్నారు.













