ఇది ఎన్టీఆర్ కుటుంబ సమస్య కాదు.. తెలుగు వారికి జరిగిన అవమానం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి జరిగిన అవమానం, భూదేవికి జరిగినట్లే అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై స్పందించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీ తీరు దయ్యాల సభలా ఉందని అన్నారు. మీ ఆడవాళ్ల గురించి ఇలా మాట్లాడితే ఏం చేస్తారు? రోజులన్నీ మీవి కావు అది గమనించి నడుచుకోవాలన్నారు. నందమూరి కుటుంబం ఎంత ఆవేదన పడిరదో చూశామన్నారు. ఎన్టీఆర్ జాతి సంపద, కుటుంబ పెద్దగా భావించాలి. ఇది ఎన్టీఆర్ కుటుంబ సమస్య కాదు, తెలుగు వారికి జరిగిన అవమానం అన్నారు. ఈ ఘటనపై ప్రతిఒక్కరూ స్పందించాలన్నారు. మహిళలంతా ఏకమై ముందుకు కదలాలి అని పిలుపునిచ్చారు. వివేకా హత్యపై మాట్లాడకుండా పక్కదారి పట్టించడం సరికాదన్నారు.













