మండలి రద్దుపై న్యాయశాఖ మంత్రిని కలుస్తా : రఘురామ
శాసనమండలిని రద్దు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలి రద్దుపై న్యాయశాఖ మంత్రిని కలుస్తానని అన్నారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు కట్టింది తక్కువ, చెప్పేది ఎక్కువ అని తప్పుబట్టారు. తన నియోజకవర్గం సమస్యలను పట్టించుకోవడం లేదు అని అంటున్నారని తెలిపారు.
ఆక్వా సాగు ప్రాంతాల్లో రోజుకు మూడు గంటల చొప్పున విద్యుత్ కోత విధిస్తున్నారని తెలిపారు. విద్యుదుత్పత్తికి బొగ్గు ఇవ్వలేని వారు అవ్వాకు సీడ్, ఫీడ్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బొగ్గుపై సీఎం జగన్ రాసిన లేఖకు ప్రధాని స్పందించారనేది నిజమేనా? అని అనుమానం వ్యక్తం చేశారు. విద్యుత్‌పై సీఎం ప్రణాళిక రూపొందించాలని సూచించారు.













