కేంద్రం ఎన్నికల సంఘం డిప్యూటీ చీఫ్ ను కలిసిన ఎంపీ రఘురామ
కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ చీఫ్ ధర్మేంద్ర శర్మను ఎంపీ రఘురామకృష్ణరాజు కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదుపై ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రఘురామ మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు తొలివారంలో విశాఖలో పర్యటించి, రాష్ట్ర ఎన్నికల అధికారులతో భేటీ అవుతానని ధర్మేంద్రశర్మ చెప్పినట్లు తెలిపారు. దొంగ ఓట్ల నమోదుపై మరింత సమాచారం ఇవ్వాలని కోరినట్లు ఆయన వెల్లడిరచారు. ఓట్ల నమోదు, తొలగింపు విషయంలో ఎలాంటి తప్పులు జరిగినా చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి తెలిపినట్లు పేర్కొన్నారు.













