ఆ ఇద్దరు మంత్రులకు కనీస పరిజ్ఞానం లేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకానికి సంబంధం లేకుండా రుషికొండలో వైసీపీ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు చేపడుతోందని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టూరిజం ముసుగులో ముఖ్యమంత్రి ఇల్లు, వ్యక్తిగత అవసరాల కోసమే కార్యాలయాన్ని కడుతున్నారన్నారు. మళ్లీ అధికారంలోకి రాలేరని తెలిసే అతిథి గృహాలను 99 సంవత్సరాల కోసం లీజుకు ఇచ్చి సొంతం చేసుకునేందుకు జగన్ దంపతులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ నిర్మాణాలను అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వం కచ్చితంగా కూల్చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమిలో భవనాలు కడితే తప్పేంటని మంత్రులు రోజా, అమర్నాథ్ అన్నారు. ఆ ఇద్దరికి కనీస పరిజ్ఞానం లేదనేందుకు నేనేమీ సంకోచించను. సీఆర్జెడ్ జోన్లో కొన్ని పరిమితులు ఉంటాయన్న విషయం వారికి తెలియదా? అని ప్రశ్నించారు.













