విశాఖ ఎంపీకి అరుదైన అవకాశం
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకి అరుదైన అవకాశం లభించింది. ప్రతిష్టాత్మక మినిస్టరీ ఆఫ్ మౌసింగ్, అర్బన్ ఆఫైర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యునిగా ఆయన నియమితులయ్యారు. ఆ శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరి చైర్మన్‌గా వ్యవహరిస్తూ భారత ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 14 మంది లోక్‌సభ, 7 రాజ్యసభ సభ్యులతో ఈ కమిటీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అయితే వైఎస్ఆర్ పార్టీ నుంచి ఏకైక లోక్‌సభ సభ్యుల నుంచి విశాఖ ఎంపీ ఎంవీవీ ఈ కమిటీలో సభ్యునిగా ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తమ అధినేత జగన్మోహన్రెడ్డితో పాటు విజయసాయిరెడ్డి, మిధున రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయించనున్న గృహాల సంఖ్య, రాయితీల పెంపు తదితర విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానన్నారు.













